ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ‘వీవర్క్’ హైదరాబాద్‌లో తన కో-వర్కింగ్ స్పేస్‌లను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైటెక్ సిటీలో 4వేల మందికి సరిపడే విధంగా 1.3 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో కార్యాలయం.. నానాక్ రామ్ గూడలో 3 వేల మందికి సరిపడే విధంగా 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కో-వర్కింగ్ స్పేస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
హైదరాబాద్‌లో వీవర్క్ కో-వర్కింగ్ స్పేస్ కార్యాలయాలు - జయేశ్ రంజన్
హైదరాబాద్‌లో ప్రారంభించిన వీవర్క్ కో-వర్కింగ్ స్పేస్.. నూతన ఆవిష్కరణలకు మంచి చేయుతనిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. వీవర్క్ సంస్థ తన కో-వర్కింగ్ స్పేస్‌లను భాగ్యనగరంలో ప్రారంభించింది. హైటెక్ సిటీ, నానక్ రామ్ గూడలో వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు అందుబాటులోకి తెచ్చారు.
హైదరాబాద్‌లో వీవర్క్ కో-వర్కింగ్ స్పేస్ కార్యాలయాలు
ఒకే సారి ఇంత విస్తీర్ణం ప్రారంభించటం భారతదేశంలో ఇదే మొదటిసారని ఆ సంస్థ ఇండియా కో-సీఈఓ ర్యాన్ బెనెట్ అన్నారు. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ వినియోగం భారీ స్థాయిలో పెరుగుతోన్న దృష్ట్యా ఇక్కడ వృద్ధిపై మంచి అంచనాలున్నాయన్నారు. కార్పొరేట్ కంపెనీలతో పాటు అంకురాలు ఒకే దగ్గర కార్యాకలాపాలు నిర్వహించటం వల్ల ఇన్నోవేషన్‌కు మంచి చేయూతనిస్తుందని జయేశ్ రంజన్ అన్నారు.
TAGGED:
jayesh ranjan