కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గాయత్రి పంపుహౌస్ వద్ద 2 బాహుబలి పంపుసెట్లు ఒకేసారి పరీక్షించి 6 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రీ పంపుహౌస్‌లో రెండు పంపులను ఒకేసారి నడిపించి సాంకేతిక అవరోధాలను అధిగమించారు. నంది మేడారం పంప్ హౌస్ నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయటంతో పాటు అంతే మొత్తం నీటిని సుమారు మూడు గంటలపాటు ఎత్తిపోతలను కొనసాగించారు.
గాయత్రి పంపుహౌస్‌లో బాహుబలి పంపుల వెట్‌రన్ - Wet Run of Bahubali Pumps in Gayatri Pumphouse
కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి పంపుహౌజ్‌లో రెండు బాహుబలి మోటార్లను అధికారులు ఒకేసారి నడిపి ఎత్తిపోతలను విజయవంతం చేశారు. సాంకేతిక అంశాలను పరిశీలించి వెట్‌రన్ నిర్వహించారు.
Wet Run of Bahubali Pumps in Gayatri Pumphouse
Last Updated : Aug 14, 2019, 7:27 AM IST