హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఫొటో వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘ సమావేశం జరిగింది. సమాజంలోని ప్రతి ఒక్కరూ సెల్ఫోన్ వాడకం వల్ల ఫొటో, వీడియో గ్రాఫర్ల జీవనం దయనీయంగా మారిందని రాష్ట్ర ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శాస్త్ర సాంకేతిక పరంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ఫొటో వీడియో గ్రాఫర్లు కూడా తమ పరిధిని మరింత పెంపొందించుకోవాలని ప్రతినిధులు వివరించారు. వచ్చేనెల 20, 21, 22 తేదీల్లో ఎన్కన్వెన్షన్ సెంటర్లలో ఫొటో ట్రెడ్ ఎక్స్పో నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు వివరించారు.
"సెల్ఫోన్లతో ఫొటో, వీడియో గ్రాఫర్ల జీవితం దయనీయంగా మారింది" - undefined
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వచ్చే నెల 20, 21, 22 తేదీల్లో ఫొటో ట్రెడ్ ఎక్స్పో నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
'సెల్ఫోన్లతో... వారి జీవనం దయనీయంగా మారింది'