హోలీ.. ఇది అన్ని పండుగల్లా కాదు.. ఇది ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఒంటి నిండా రంగులు... మనసు నిండా సంతోషం... దీనిని చిన్నా... పెద్దా అందరూ ఇష్టపడతారు.
ఎరుపు రంగు ఏం చెబుతుందంటే..?
ఎరుపు రంగు సృజనాత్మతకు నిదర్శనంగా భావిస్తారు. కొంత మంది శుభానికి సంకేతంగా భావిస్తారు. అలాగే విప్లవానికి గుర్తు.
నలుపు రంగు..
అన్ని రంగులకు మూలం నలుపు వర్ణం. హోదాకి, హుందాకి చిహ్నం ఈ వర్ణం. ఈ రంగు చెడు శక్తులను ఆకర్షించి తనలో లీనం చేసుకుంటుంది.
తెలుపు రంగు..
తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకి సంకేతం. ఈ రంగు మనకు ఆశావాద దృక్పథాన్ని నేర్పిస్తుంది. ప్రశాంతతకు తెలుపు నిదర్శనం. ఈ వర్ణంలో ఉన్న స్వచ్ఛత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి కారణమవుతుందని చెబుతారు.
నీలిరంగు..