హైదరాబాద్‌లో ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు ర్యాంపు వాక్‌లతో ఆకట్టుకున్నారు. బేగంపేటలోని జేడీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు 'ఆరంభ్' పేరుతో స్వాగతోత్సవాలు నిర్వహించారు. ఫ్యాషన్ ప్రపంచంలో తొలి అడుగులు వేస్తున్న యువతీ, యువకులు తమ ఆటపాటలతో వేదికను హోరెత్తించారు. ర్యాంప్‌పై క్యాట్‌వాక్, జోష్ పెంచే నృత్యాలతో ఉర్రూతలూగించారు. మేధాశక్తిని పెంచే క్వీజ్ పోటీలతో పాటు వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
బేగంపేటలో 'ఆరంభ్' పేరిట స్వాగతోత్సవాలు - హైదరాబాద్
హైదరాబాద్ బేగంపేటలోని ఓ ఫ్యాషన్ కళాశాల విద్యార్థులు 'ఆరంభ్' పేరుతో స్వాగతోత్సవాలు నిర్వహించారు.
నగరంలోని ఓ కళాశాలలో 'ఆరంభ్' పేరుతో స్వాగతోత్సవాలు