తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2020, 4:46 PM IST

ETV Bharat / state

అందరి భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం: సీపీ

పోలీసింగ్​లో ప్రజలు పాలుపంచుకున్నప్పుడే సమాజం బాగుంటుందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

'ట్రాఫిక్​ నిబంధనల అమలు పటిష్టత కోసమే వీకాప్'
'ట్రాఫిక్​ నిబంధనల అమలు పటిష్టత కోసమే వీకాప్'

ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో నగర ప్రజలు బాగస్వాములైనప్పుడే రోడ్డు ప్రమాదాలు అదుపులోకి వస్తాయని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సూచించారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో మరింత అవగహన తీసుకురావాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ సిటీ సెక్యురిటి కౌన్సిల్ (HCSC) ఆధ్వర్యంలో తార్నాక ఎన్ఐఎన్ ఆడిటోరియంలో ”వీకాప్” (స్మాల్ కాప్) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ అంజనీకుమార్ 'వీకప్ బుక్ లెట్​'ను ఆవిష్కరించారు.

విద్యాభ్యాసం ఇంట్లోంచే మొదలుకావాలి..

కరోనా, రోడ్ సేఫ్టీ, ఇతర విషయాల్లో హైదరాబాద్ పోలీసుల పనితీరు అభినందనీయమన్నారు. కోటి 30 లక్షల మంది నివసిస్తున్న భాగ్యనగరంలో అన్ని రకాలుగా రక్షణ ఉందని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. విద్యాభ్యాసం మొదట ఇంట్లోనే మొదలు కావాలని... విద్యాలయాల్లో కాదని సీపీ స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు పోలీస్​గా తమ బాధ్యతలను నిర్వర్తించాలని.. అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. అందులో భాగంగానే వికాప్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇది పిల్లల కోసం మాత్రమే కాదని.. నేటి విద్యార్థులే రేపటి యువత కాబట్టి వారికి విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల బాధ్యతను తెలియజేసేందుకు వీకాప్​ను ప్రారంభించామని వివరించారు.

ఇవీ చూడండి : 'పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బంది పెరగాలి'

ABOUT THE AUTHOR

...view details