తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యార్థుల అభ్యున్నతికి స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలి' - హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉంటాయని... స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వాటిని అభివృద్ధి చేసేందుకు తోడ్పడాలని హైదరాబాద్​ జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి సూచించారు.

website-launch-for-digital-classrooms-in-hyderabad
'విద్యార్థుల అభివృద్ధికై స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి'

By

Published : Jan 22, 2021, 7:09 PM IST

పేద విద్యార్థుల అభివృద్ధి కోసం మంచుకొండ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి అన్నారు. హైదరాబాద్​లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచుకొండ ఫౌండేషన్ దత్తత పాఠశాలల వైబ్‌సైట్‌ను ఆమె ప్రారంభించారు. షేక్​పేట, మేకల మండి, ఓల్డ్ నల్లగుట్ట, కాలెడేరా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు... ఇలాంటి సంస్థలు మరిన్నీ ముందుకు రావాలని సూచించారు. పట్టణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు ఉంటాయి కానీ... గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలల్లో అనేక సమస్యలు ఉంటాయన్నారు. సాయం అందించేందుకు స్వచ్ఛంద, సేవా సంస్థలు ముందుకు వచ్చినప్పుడు ప్రధానోపాధ్యాయులు సకాలంలో స్పందించి, వారికి సరైనా గౌరవం ఇవ్వాలని సూచించారు. అప్పుడే గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో నాలుగు ప్రభుత్వ పాఠశాలలో నాలుగు డిజిటల్ క్లాస్ రూమ్​లను ఏర్పాటు చేశామని... త్వరలో మరిన్ని పాఠశాలలో వీటిని ఏర్పాటు చేస్తామని మంచుకొండ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు ప్రకాశం తెలిపారు.

ఇదీ చూడండి:'తెలంగాణ పవర్​ప్లాంట్ రెండో దశకు శంకుస్థాపన అప్పుడే జరగాలి'

ABOUT THE AUTHOR

...view details