weather updates : రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర తెలంగాణ వరకూ 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రెండుచోట్ల జల్లులు పడ్డాయి.
weather updates : నేడు తేలికపాటి వర్షాలు - తెలంగాణ వార్తలు
weather updates : గత కొన్ని రోజులుగా చలిగాలులతో గజగజలాడుతున్న రాష్ట్ర ప్రజలను వరుణుడు పలకరించనున్నాడు. నేడు రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
rain in telangana
మంగళవారం తెల్లవారుజామున రాష్ట్రంలో అత్యల్పంగా కసలాబాద్(రంగారెడ్డి జిల్లా)లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటోంది.
ఇదీ చూడండి:Homeless in Winter Telangana : ఓవైపు చలి.. మరోవైపు ఆకలి.. నిరాశ్రయులకు నీడేది..?