ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఆగస్టు 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.
తెలంగాణలో మరో మూడురోజులపాటు వర్షాలు
తెలంగాణలో రాబోయే మూడురోజుల్లో వాతావరణ వివరాలను హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదివారం పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని.. సోమ, మంగళవారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకులు వెల్లడించారు.
రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో వాతావరణ సూచన
దక్షిణ ఝార్ఖండ్, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైఋతి దిశ వైపునకు వంపు తిరగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశముందని హైదరాబాద్ ఐఎండీ సంచాలకులు వెల్లడించారు.