ఈ నెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా శ్రీలంక వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణీ ఏర్పడిందన్నారు. ఇది ఉపరితల ఆవర్తనంగా మారి రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో దసరా రోజుకు వర్షాలు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
దసరా పండుగ రోజున భారీవర్షం...! - HEAVY RAIN ON DUSSERA FESTIVAL
దసరా, ఆ మరుసటి రోజు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఉపరిత ద్రోణీ... ఆవర్తనంగా మారి దసరా రోజుకు వర్షాలు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.
WEATHER UPDATE: HEAVY RAIN ON DUSSERA FESTIVAL