ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. బుధవారం అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. మంగళవారం 6 చోట్ల స్వల్పంగా వర్షం పడింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. తేమగాలులు వస్తున్నందున ఆకాశం మేఘావృతమై ఉంటోంది. మేఘాలుంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గవు.
తేమ గాలుల ప్రభావంతో.. వర్షాలకు అవకాశం
ఆగ్నేయ భారతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నందున ఇవాళ అక్కడక్కడ ఓ మాదిరి వర్షాలు పడే అవకాశముంది. మంగళవారం గిన్నెదారిలో అత్యల్పంగా 13.2 డిగ్రీలుండగా పగలు అత్యధికంగా రామగుండంలో 30.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తేమ గాలుల ప్రభావంతో.. వర్షాలకు అవకాశం
మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 13.2, ఆదిలాబాద్లో 14.2, మెదక్లో 15, రామగుండంలో 18, హైదరాబాద్లో 19.5 డిగ్రీలుంది. రెండు రోజుల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి సాధారణం కన్నా 4-5 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రత పెరగడంతో చలి తీవ్రత కాస్త తగ్గింది. మంగళవారం పగలు హైదరాబాద్లో అత్యధికంగా 27.3, రామగుండంలో 30.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇదీ చదవండిః పురపాలిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల