రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం తీరం దాటి ఝార్ఖండ్‌పైకి చేరింది. ఇది తెలంగాణ వైపునకు తిరిగి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఝార్ఖండ్ నుంచి పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాలవైపు పయనిస్తుందని అంచనా. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షాలు కురుస్తాయి. వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి.
Rains: అల్పపీడన ప్రభావం.. నేడూ రేపూ మోస్తరు వానలు - తెలంగాణ వార్తలు
రాష్ట్రంలో నేడూ, రేపు ఓ మాదిరి వానలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణ వైపునకు తిరిగి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. వర్షం పడే సమయంలో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఆదివారం ఉదయం 8 నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 13.8, కోనరావుపేట, చందుర్తిలో 12, పెద్దూరులో 11.5, ముస్తాబాద్, ఇల్లంతకుంట, వేములవాడలో 10, భీంగల్(నిజామాబాద్)లో 11, ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లో 10, బజార్‌హత్నూర్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 4 నుంచి 6 డిగ్రీల వరకు తక్కువగా ఉంటోంది. గాలిలో తేమ సాధారణంకన్నా 27 నుంచి 29 శాతం అధికంగా ఉంది.
ఇదీ చదవండి:Raithu Bhandu: నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు సొమ్ము