రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రం దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది.
అల్పపీడనం కారణంగా తేలికపాటి వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
అల్పపీడనం కారణంగా తేలికపాటి వర్షాలు
వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రేపు 42- 44 డిగ్రీల గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.