రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి అక్కడక్కడా ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో వెలువరించింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - హైదరాబాద్ వాతావరణ కేంద్రం
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు పశ్చిమ రాజస్థాన్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు.
పశ్చిమ రాజస్థాన్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని పేర్కొంది. ఇది క్రమంగా రాగల 2 రోజులలో పశ్చిమ దిశగా రాజస్థాన్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆగష్టు 24వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
ఇవీ చూడండి: మరో అడుగు దూరం.. నిండు కుండలా నాగార్జున సాగర్