తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాగల రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులపాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు.. ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
మూడ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశం
ఈ నెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులపాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ సంచాలకులు తెలిపారు. రాగల రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలున్నాయన్నారు.
మూడ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశం
నిన్న మరఠ్వాడ నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడిందని వెల్లడించారు. ఈరోజు కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నాయన్నారు.
ఇదీ చదవండి: Vaccination: కొత్త మార్గదర్శకాలు ఇవే...