రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నాయి. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా పుల్కల్(సంగారెడ్డి జిల్లా)లో 2, పాన్‌గల్(వనపర్తి)లో 1 సెం.మీ. వర్షం కురిసింది.
గత నెలలో కురిసిన వర్షాలకు రాష్ట్రం చిగురాకుల వణికింది. పలు చోట్లు వరదలు ముంచెత్తాయి. జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. చెరువులు, వాగులు మత్తడి పోసి... చూపరులను ఆకట్టుకుంటున్నాయి.