రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - వాతావరణ సమాచారం
ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడ వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రానున్న మూడురోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడ వరకు విదర్భ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పారు.
ఇవీ చూడండి:'ప్రతిఒక్కరూ మొక్కలు నాటే మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలి'