రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు - రాష్ట్రానికి వర్షసూచన
రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడా తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు
ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్ వరకు మధ్య మహారాష్ట్ర, ఉత్తర మరత్వాడా మీదుగా 0.9కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.