హిమాలయాల నుంచి శీతలగాలులు తెలంగాణ వైపు వస్తున్నందున రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఇవాళ, రేపు పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 లేదా 4డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. రేపు ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రధానంగా ఉత్తర, ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.
వణుకుతున్న రాష్ట్రం... పెరుగుతున్న చలి - రాష్ట్రంలో చలి తీవ్రత
రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వణుకుతున్న రాష్ట్రం... పెరుగుతున్న చలి
సోమవారం కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామంలో ఈ శీతాకాలంలోనే అత్యల్పంగా 4.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో వందేళ్లలో రాత్రిపూట అత్యల్ప ఉష్ణోగ్రత 2017, డిసెంబరు 27న ఆదిలాబాద్‌లో 3.5 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వద్ద రికార్డు ఉంది.