తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో భానుడి భగభగలు - Weather report in Telangana

తెలంగాణ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే భానుడి భగభగలు ఎక్కువగా ఉండగా.. రానున్న రోజుల్లో వాటి తీవ్రత మరింత పెరుగునుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నవేళల్లో బయట తిరగొద్దని సూచిస్తున్నారు.

తెలంగాణలో భానుడి భగభగలు

By

Published : Apr 27, 2019, 6:18 AM IST

Updated : Apr 27, 2019, 7:33 AM IST

తెలంగాణలో భానుడి భగభగలు

రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. శుక్రవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోరట్​పల్లి, మంచిప్పలలో 45.5, మోర్తాడ్, లక్ష్మాపూర్​ల​లో 45.3 డిగ్రీలు ఉండగా.. ఆదిలాబాద్ జిల్లా బేల, జైనథ్​లో 45.4, రామగుండంలో 44, హైదరాబాద్​లో 41.2 డిగ్రీలుగా నమోదయింది. ఇవి మరింత పెరిగే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.


ఉడుకుతున్న తెలంగాణం


వాయువ్య భారతంలోని రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వైపు పొడిగాలులు వీస్తున్నాయి. విదర్భను ఆనుకొని ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్​తో పాటు ఉత్తర తెలంగాణ అధిక వేడిమితో ఉడుకుతోంది. ఎండ వేడి అధికంగా ఉంటున్నందున పగటి పూట బయట తిరగటం ఆరోగ్యానికి మంచిది కాదని.. ఆప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. వాయువ్యం నుంచి వీస్తున్న పొడిగాలులు రాష్ట్రంలోని గాలిలో తేమను మింగేస్తున్నాయి. దీనివల్ల పొడి వాతావరణం ఏర్పడి ఉక్కపోత అధికంగా ఉంటోంది.

ఇవీ చూడండి: నేడు ఓరుగల్లు ప్రథమ పౌరుడి ఎన్నిక

Last Updated : Apr 27, 2019, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details