తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రెండు మూడు రోజుల పాటు.. తేలికపాటి వర్షాలు - హైదరాబాద్ వాతావారణ కేంద్రం
రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం–ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9కిమీ ఎత్తు వద్ద ఉత్తర -దక్షిణ ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్ర సంచాలకులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:-'కరోనా వేళ ఎన్నికల నిర్వహణకు సూచనలు ఇవ్వండి'