తెలంగాణ

telangana

ETV Bharat / state

అలర్ట్.. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా సిత్రాంగ్‌ - Weather Information of AP

Cyclone Sitrang: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సిత్రాంగ్‌ స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది.

రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా సిత్రాంగ్‌
రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా సిత్రాంగ్‌

By

Published : Oct 24, 2022, 5:28 PM IST

Weather information: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ‘సిత్రాంగ్‌’ స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. ఈ తుపాను ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21కి.మీ వేగంతో కదులుతుందని.. ప్రస్తుతం సాగర్‌ దీవికి 380కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. రేపు ఉదయానికి బంగ్లాదేశ్‌లోని టికోనా దీవికి సమీపంలో బరిసాల్‌ వద్ద తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్టు తెలిపింది.

అనంతరం వాయుగుండంగా, ఆ తదుపరి అల్పపీడనంగా బలహీనపడుతుందని పేర్కొంది. తుపాను ‘సిత్రాంగ్‌’ ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తుపాను పరిసర ప్రాంతాల్లో 2.4 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నట్లు ఐఎండీ వివరించింది. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details