తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రమంగా బలహీనపడుతున్న తీవ్ర వాయుగుండం - ఏపీలో భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటింది. ఈ ప్రభావంతో కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరాన్ని దాటిన తరువాత వాయుగుండం క్రమక్రమంగా బలహీనపడుతోంది.

క్రమంగా బలహీనపడుతున్న తీవ్ర వాయుగుండం
క్రమంగా బలహీనపడుతున్న తీవ్ర వాయుగుండం

By

Published : Oct 13, 2020, 3:25 PM IST

క్రమంగా బలహీనపడుతున్న తీవ్ర వాయుగుండం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటింది. తీరం దాటినప్పటి నుంచి వచ్చే 24 గంటల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.

ఇదీ చదవండి:జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details