పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది. నరసాపురం-కాకినాడ మధ్య వాయుగుండం తీరాన్ని దాటింది. మరో నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణశాఖ సూచించింది. గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు , రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హచ్చరించింది.
తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం.. నాలుగైదు గంటలు వర్షగండం - ఏపీలో భారీ వర్షాలు
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. నరసాపురం-కాకినాడ మధ్య వాయుగుండం తీరాన్ని దాటింది. గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
కాకినాడ భూభాగాన్ని తాకిన తీవ్ర వాయుగుండం
Last Updated : Oct 13, 2020, 8:28 AM IST