తెలంగాణ

telangana

రాష్ట్రంలో రాగల మూడు రోజులు.. వర్షాలు కురిసే అవకాశం

రాష్ట్రంలో రాగల మూడు రోజులు పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది.

By

Published : Jul 22, 2020, 5:10 PM IST

Published : Jul 22, 2020, 5:10 PM IST

weather forecast next Three days to rain come in the telangana
రాష్ట్రంలో రాగల మూడు రోజులు.. వర్షాలు కురిసే అవకాశం

రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో రాగల మూడు రోజులు పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈరోజు కొన్ని చోట్ల, రేపు, ఎల్లుండి అనేక చోట్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. చత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. ఈ తరుణంలో తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా వర్షం రావచ్చని వెల్లడించింది.

ఇదీ చూడండి :బాలల హక్కుల సంఘం అధ్యక్షడు అచ్యుతరావు కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details