రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు.. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు - తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడనున్నాయని తెలిపింది.
ఉత్తర ఆంధ్ర, ఒడిశా తీరాలకు దగ్గరలో ఉన్న బంగాళాఖాతం ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఉత్తర బీహార్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు.. ఝార్ఖండ్, బెంగాల్ వాయువ్య బంగాళాఖాతం మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుందని వెల్లడించింది. ఈ రెండింటి ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇదీ చూడండి :కేంద్ర హోంమంత్రి పతకానికి సీబీఐ హైదరాబాద్ ఎస్పీ ఎంపిక