తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

weather-forecast-in-telangana-next-three-days
రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

By

Published : Oct 9, 2020, 5:31 PM IST

రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్‌, సిద్దిపేట, జనగామ, వరంగల్‌ పట్టణ, గ్రామీణ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. అది ఈరోజు ఉత్తర అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో కేంద్రీకృతమైందని వివరించింది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది.

ఇదీ చూడండి :తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

ABOUT THE AUTHOR

...view details