రాష్ట్రంలో మూడు రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, రేపు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలతో పాటు.. ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం - rained for three days in Telangana
రాష్ట్రంలో మూడు రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సెప్టెంబరు 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం
ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుమారు సెప్టెంబరు 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. భారతదేశం మీదుగా 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోందని తెలిపింది. దాని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. హైదరాబాద్లో ఇవాళ భారీ వర్షం కురుసింది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీవర్షం పడింది.
ఇదీ చూడండి :వివాహ వేడుకలో ఇరువర్గాల ఘర్షణ... పదకొండు మందిపై కేసు