వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఆ ప్రభావంతో రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్లు విస్తారంగా వానలు పడతాయని పేర్కొన్నారు.
నేడు తేలికపాటి వర్షాలు.. రేపు, ఎల్లుండి భారీ వర్షం
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
నేడు తేలికపాటి వర్షాలు.. రేపు, ఎల్లుండి భారీ వర్షం
రాష్ట్రంలో ఈరోజు తేలిక పాటి వర్షాలు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని రాజారావు పేర్కొన్నారు.
ఇదీ చూడండి :కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. భూమిపూజ చేసిన కేటీఆర్, హరీశ్
TAGGED:
నేడు తేలికపాటి వర్షాలు