రాష్ట్రంలో రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీస్తాయని తెలిపింది. ఈరోజు మాత్రం పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు!
రాష్ట్రంలో రాగల రెండు రోజులు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలతోపాటు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు!
ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ కోస్తా, తమిళనాడు వరకు కొనసాగనుంది. సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వరకు వాతావరణం స్థిరంగా కొనసాగుతుందని ఐఎండీ అధికారులు వివరించారు.
ఇదీ చూడండి :ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వరకు వేసవి సెలవులు