తెలంగాణ

telangana

Weather Forecast in next 15 days: మరో 15రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం!

By

Published : Oct 2, 2021, 8:53 AM IST

గులాబ్​ తుఫాన్​ ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన వర్షాల నుంచి ఇంకా తెలంగాణ తేరుకోనేలేదు. మరో పదిహేను రోజులు ఈ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్​లో వర్షాలు కుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి. సెప్టెంబర్​ నెలాఖరులో సైదాబాద్​లో సాధారణం కన్నా 60 శాతం అదనంగా వర్షం కురిసింది.

Weather Forecast in next 15 days
వర్షాలు

రాజధాని వాన జోరుగా కురుస్తోంది. మూడేళ్లుగా వర్షాకాలం మొదలైనప్పట్నుంచే నగర రహదారులు ఏరులై పారుతున్నాయి. నాలాల్లోని వ్యర్థాలు, చెరువుల్లోని మురుగు జలాలు వరదలో కొట్టుకుపోతున్నాయి. మూసీ నదికీ మేలు జరుగుతోంది. ఏళ్లనాటి వ్యర్థాలు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. రెండేళ్లుగా జంట జలాశయాల నుంచి వస్తోన్న వరద ధాటికి పూడిక మట్టి క్రమంగా దిగువకు మళ్లుతోంది. భూగర్భ జలాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శివారు ప్రాంతాల్లోనేగాక ప్రధాన నగరంలోనూ గతంతో పోలిస్తే బోరుబావుల్లోని నీటి మట్టం గణనీయంగా పెరిగిందని గణాంకాలు సైతం స్పష్టం చేస్తున్నారు.

గ్రేటర్‌లో ఏటికేడు వర్షాలు పెరుగుతున్నాయి. 2016 నుంచే నగరంలో ఏటా వరదల తీవ్రత పెరుగుతోంది. మరీ ముఖ్యంగా 2020, సెప్టెంబరులో 30సెం.మీ.లకుపైగా వర్షపాతంతో అతిభారీ వర్షం నమోదైంది. గతేడాది ఆగస్టు నుంచి అక్టోబరు వరకు నెలలో సగటున ఐదు రోజులు కుండపోతగా వాన కురిసింది. 2019లోనూ దాదాపు అదే వాతావరణం కనిపించింది. అప్పట్లో హైటెక్‌సిటీలో రోడ్లు నీట మునిగి.. సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లోని సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీయులు విమానాశ్రయం చేరుకోలేక అవస్థలుపడిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరమూ నగరంలో వానల జోరు కొనసాగింది. సెప్టెంబరు నెలాఖరు నాటికే సైదాబాద్‌ మండలంలో సాధారణంకన్నా 60శాతం అదనంగా వాన కురిసింది.

గ్రేటర్‌లోని 28 మండలాల సగటును పరిశీలిస్తే.. 30శాతం మేర అదనంగా వర్షం కురిసింది. వాతావరణశాఖ అంచనాల ప్రకారం నగరంలో మరో 15రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని, నెల రోజులు గడిస్తే ఈ ఏడాది వర్షపాతం సాధారణానికి రెట్టింపు అయ్యే అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details