తెలంగాణ

telangana

ETV Bharat / state

అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవు: సజ్జనార్‌ - latest news on We will take action if unnecessarily getting on the roads: Sajjanar

లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి.. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి లాక్‌డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించారు.

We will take action if unnecessarily getting on the roads: Sajjanar
అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవు: సజ్జనార్

By

Published : Apr 23, 2020, 7:19 PM IST

అనవసర కారణాలతో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. లాక్‌డౌన్ అమలవుతున్న తీరుపై కమిషనరేట్ పరిధిలో ఆయన పర్యటించారు. హైదర్‌గూడ ఎక్స్‌రోడ్, ఉప్పరపల్లి డీమార్ట్‌, మైలార్‌దేవ్‌పల్లి, కింగ్స్ కాలనీ, ఓవైసీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు.

ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ పక్కాగా అమలవుతున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 12 వేల వాహనాలను జప్తు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణలో భాగంగా ముందు వరుసలో ఉండి పని చేస్తున్న పోలీస్‌ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

ఇదీ చదవండి:సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details