రైతులకు నష్టం కలగకుండా ధాన్యం సేకరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 2 లక్షల 19 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. సేకరించిన ధాన్యంలో 93 శాతం రైస్ మిల్లులకు పంపించామన్నారు.
'ప్రతిగింజనూ కొంటాం.. రైతులకు అండగా ఉంటాం' - Minister Vemula prashanth reddy latest news
రాష్ట్రంలో హమాలీల సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు నష్టం కలగకుండా ధాన్యం సేకరించాలని అధికారులను ఆదేశించారు.
హమాలీల సమస్య తీరుస్తాం: మంత్రి వేముల
హమాలీల సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు ధాన్యంలో తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరుగు తీసుకునే రైస్ మిల్లులను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు.
Last Updated : May 3, 2020, 4:17 PM IST