తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్ర సరిహద్దుల వద్ద 18 చెక్​పోస్టుల ఏర్పాటు​'

కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో 18 చెక్​పోస్టులను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్​ తెలిపారు. కొవిడ్​-19 వైరస్​ వ్యాప్తి నివారణపై ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు.

CM KCR
CM KCR

By

Published : Mar 19, 2020, 10:27 PM IST

కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్​ పోస్టుల సంఖ్య పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్​ తెలిపారు. తెలంగాణకు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయని... ఆయా రాష్ట్రాల సరిహద్దుల వద్ద 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తామన్నారు.

రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతిలేదని సీఎం స్పష్టం చేశారు. అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించవద్దని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలను రద్దు చేశామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వహించబోమని చెప్పారు. ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాటు చేస్తామని.. ప్రజలు ఇళ్ల నుంచే వీక్షించవచ్చని సీఎం కేసీఆర్​ వివరించారు.

ఇదీ చదవండిః'కరోనా'పై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details