లైవ్‌స్టాక్ టెక్నాలజీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హాటల్లో ట్రాపికల్ ఎనిమల్ జెనెటిక్స్ ట్యాగ్ సాంకేతిక పరిజ్ఞానంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో లైవ్‌స్టాక్ టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రవీణ్ కిని, సహ వ్యవస్థాపకులు అలూరి శ్రీనివాసరావు, రోస్లిన్ సంస్థ డైరెక్టర్ డాక్టర్.బ్రూస్ వైట్‌లా పాల్గొన్నారు. ఎంబ్రో సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన జన్యు మార్పిడి, అధిక పాల ఉత్పత్తిని, బహుళ ప్రయోజనాలను పొందవచ్చని అలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ విధానాలను దేశంలో కూడా తీసుకువస్తున్నామని.. 70 మిలియన్ల పాడి రైతుల ఆదాయన్ని రెట్టింపు చేస్తామని ఆయన వెల్లడించారు. అమెరికా లాంటి దేశాలు ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
'పాడిరంగంతో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం' - రోస్లిన్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బ్రూస్ వైట్
పాడిరంగంలో బహుళ ప్రయోజనాలు పొందే విధంగా ట్రాపికల్ఎనిమల్ జెనెటిక్స్ ట్యాగ్ సాంకేతిక పరిజ్ఞానం తీసకువస్తున్నట్లు... హైదరాబాద్‌లోని ఓ హోటల్లో లైవ్‌స్టాక్ టెక్నాలజీ సంస్థ సహా వ్యవస్థాపకులు అలూరి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ విధానంతో దేశంలో 70 మిలియన్ల పాడి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తమన్నారు.
పాడిరంగంతో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం