తెలంగాణ

telangana

ETV Bharat / state

'జనసేనతో భవిష్యత్​లోనూ కలిసి పనిచేస్తాం' - Bjp, Janasena updates

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పనిచేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లోనే కాకుండా భవిష్యత్​లోనూ కలిసి పనిచేయనున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్​లోని నాదెండ్ల మనోహర్ నివాసంలో ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు.

'జనసేనతో భవిష్యత్​లోనూ కలిసి పనిచేస్తాం'
'జనసేనతో భవిష్యత్​లోనూ కలిసి పనిచేస్తాం'

By

Published : Nov 20, 2020, 4:19 PM IST

Updated : Nov 20, 2020, 5:33 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాతో కలిసి రావాలని జనసేనను కోరినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భాజపా విజయానికి పూర్తిగా సహకరిస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మార్పు కోరుకుంటున్నారనేందుకు దుబ్బాక ఉపఎన్నికే నిదర్శనమని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మద్దతు తెలపాలని జనసేన పార్టీని కోరినట్లు ఆ పార్టీ నేత లక్ష్మణ్‌ అన్నారు. భాజపాకు మద్దతు ఇవ్వడానికి జనసేన పార్టీ అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. కేవలం ఈ ఎన్నికల్లోనే కాదు భవిష్యత్తులోనూ కలిసి పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపాకు జనసేన తోడుంటే ప్రజల కలలు నెరవేరుతాయన్నారు.

'జనసేనతో భవిష్యత్​లోనూ కలిసి పనిచేస్తాం'

ఇదీ చూడండి:జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలవాల్సిన అవసరం ఉంది: పవన్‌ కల్యాణ్‌

Last Updated : Nov 20, 2020, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details