జీహెచ్ఎంసీలో 23 లింక్‌రోడ్ల నిర్మాణాలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లతో సమావేశమైన సీఎస్.. రూ. 314 కోట్ల వ్యయంతో 37 లింక్‌రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు.
వచ్చే రెండేళ్లలో లింక్ రోడ్లు పూర్తి చేస్తాం: సీఎస్ - సీఎస్ సోమేశ్ కుమార్ తాజా వార్తలు
హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీలో 23 లింక్‌రోడ్ల నిర్మాణాలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
వచ్చే రెండేళ్లలో లింక్ రోడ్లు పూర్తి చేస్తాం: సీఎస్
మూసీ వెంట ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం చేపడతామన్నారు. అందుకోసం స్థలాలు ఎంపిక చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. బ్రిడ్జిల నిర్మాణం ద్వారా మూసీ తీర ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని సోమేశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి :పేదల ఇళ్లకు జాతీయ గుర్తింపు.. ప్రధానిని కలిసేందుకు ముగ్గరికి అవకాశం