తెలంగాణ

telangana

ETV Bharat / state

కృత్రిమ మేథస్సుతో మాస్కు లేని వాళ్ల గుర్తింపు : డీజీపీ

కృత్రిమ మేథస్సును ఉపయోగించి మాస్కులు లేకుండా తిరిగే వాళ్లను గుర్తిస్తున్నామని డీజీపీ మహేందర్​ రెడ్డి తెలిపారు. దేశంలోని తొలిసారిగా తెలంగాణలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టామని డీజీపీ వెల్లడించారు.

డీజీపీ మహేందర్​ రెడ్డి
డీజీపీ మహేందర్​ రెడ్డి

By

Published : May 8, 2020, 3:30 PM IST

మాస్కులు లేకుండా తిరిగే వాళ్లను గుర్తించేందుకు కృత్రిమ మేథస్సును ఉపయోగిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ఈ రకమైన వినూత్న ప్రయోగాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో మొదలు పెట్టామని డీజీపీ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా జన సమూహాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ ప్రయోగాన్ని అమలు చేస్తున్నట్లు మహేందర్​ రెడ్డి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details