ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ రైతుబంధు అమలు చేస్తున్నామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. తమ ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యమని ట్వీట్ చేశారు. రైతుల పట్ల సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్తశుద్ధికి అభినందనలు తెలిపారు.
తెరాస ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యం: కేటీఆర్ - హైదరాబాద్ తాజా వార్తలు
తమ ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యమని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల పట్ల సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్తశుద్ధికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యం: మంత్రి కేటీఆర్
ఈ నెల 27 నుంచి 58 లక్షలకు పైగా ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తామన్నారు. రూ.7,300 కోట్లను రైతులకు అందిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు ఉసంహరించుకునే వరకు పోరాటం చేస్తామన్నారు.
ఇదీ చదవండి:' కర్షకుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెడితే ఊరుకోం'