తెలంగాణ

telangana

ETV Bharat / state

గుణాత్మకమైన మార్పుల కోసం 16 స్థానాలు గెలవాలి - RANJITH REDDY

చేవెళ్ల తెరాస అభ్యర్థి రంజిత్ రెడ్డి నియోజకవర్గం​ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దేశంలో గుణాత్మకమైన మార్పుల కోసం 16 స్థానాలను గెలిపించాలని కోరారు.

జోరుగా తెరాస ప్రచారం

By

Published : Mar 31, 2019, 7:18 PM IST

జోరుగా తెరాస ప్రచారం
హైదరాబాద్​లోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చేవెళ్ల తెరాస అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. చందానగర్, మియాపూర్ డివిజన్​​లలో తెరాస శ్రేణుల బైక్ ర్యాలీలు నిర్వహించారు. బీకే రాఘవ రెడ్డి గార్డెన్​లో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశంలో గుణాత్మకమైన మార్పులు జరగాలంటే తెరాస 16 ఎంపీ స్థానాలు గెలవాలన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్, భాజపాలతో విసుగు చెందారు. అందుకే ప్రత్యామ్నాయ శక్తిగా కేసీఆర్ నేతృత్వంలోని సమాఖ్య కూటమి వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details