తెలంగాణ

telangana

ETV Bharat / state

kcr clarify on 3 acres to dalits: దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పనేలేదు: సీఎం

cm kcr on 3 acres of land
cm kcr on 3 acres of land

By

Published : Oct 5, 2021, 4:20 PM IST

Updated : Oct 5, 2021, 5:22 PM IST

16:18 October 05

దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పనేలేదు: సీఎం

దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పనేలేదు: సీఎం

తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పనేలేదని (kcr clarify on 3 acres to dalits) ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పానంటూ వివరణ ఇచ్చారు. దళితబంధు పథకంతో పాటు మూడెకరాల భూమి కూడా ఇస్తారా.. అంటూ మజ్లిస్‌ సభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ అడిగిన ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. దళితులకు ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తామని.. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నామని చెప్పారు. ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పామని అసెంబ్లీ వేదికగా కేసీఆర్​ స్పష్టం చేశారు.  

ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పాం..!

'దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పనేలేదు. ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పాను. దళితులకు ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తామని చెప్పాం. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నాం. ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పాం.'

                                                            - సీఎం కేసీఆర్​


ఇదీచూడండి :Kcr On Trs Party: 'మాది రాజకీయ పార్టీ.. మఠం కాదు... ముందుండేది కూడా మేమే'

Last Updated : Oct 5, 2021, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details