Tamilisai Soundararajan : ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆమె.... అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యాక్సినేషన్లో ప్రపంచంలోనే ముందున్నందుకు గర్వంగా ఉందన్న గవర్నర్... త్వరలోనే 200 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసుకోనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఎదగడం సంతోషకరమని గవర్నర్ తెలిపారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఎదిగిందన్న గవర్నర్... రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత అంబులెన్స్ డ్రైవర్స్, పారిశుద్ధ్య కార్మికులతో గవర్నర్ కాసేపు ముచ్చటించారు. అంతకుముందు... గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లోని యుద్ధవీరుల స్థూపం వద్ద తమిళిసై సౌందర్‌రాజన్ నివాళులర్పించారు.