తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం: కవిత - జీహెచ్​ఎంసీ ఎన్నికల వార్తలు

తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి సమున్నత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముషీరాబాద్ అడికిమెట్​లోని మెట్రో రెసిడెన్సీలో జరిగిన బ్రాహ్మణుల సమావేశంలో పాల్గొన్నారు.

we giving equal priority to all in telangana mlc kavitha said in hyderabad
అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం: కవిత

By

Published : Nov 23, 2020, 5:10 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో తెరాస ప్రజాప్రతినిధులు విస్తృతంగా పాల్గొంటున్నారు. ముషీరాబాద్ అడికిమెట్​లోని మెట్రో రెసిడెన్సీలో జరిగిన బ్రాహ్మణుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతర విద్యుత్ సరఫరా చేసిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భాజపా మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.

తెరాస ప్రభుత్వం 450 సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. పేరుకు పెద్ద కులం కానీ బ్రాహ్మణుల్లో కూడా అనేక మంది పేదలు ఉన్నారన్నారు. హైదరాబాద్ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చే రాజకీయ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం: కవిత

ఇదీ చదవండి:జీహెచ్​ఎంసీ పోరులో వంద స్థానాలు సాధిస్తాం : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details