టోక్యో ఒలింపిక్స్‌లో పీసీ సింధు కాంస్య పతకం సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ కరోనా పరిస్థితుల్లోనూ ఒలంపిక్స్‌కు వెళ్లడం సాహసమేనన్నారు. వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడం మాములు విషయం కాదని చెప్పారు. బంగారు పతకం విషయంలో నిరాశే ఎదురైనా కాంస్య పతక పోరులో సింధు చక్కటి ఆట తీరు కనబర్చడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ప్రధాని మాటలు సింధూలో ఎంతో స్ఫూర్తి నింపాయన్నారు. హైదరాబాద్ వచ్చాక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సింధు కలుస్తుందని వెల్లడించారు.
పీపీ సింధు.. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు సార్లు పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. వెళ్లేటప్పుడు పలు సూచనలు చేశా. నిన్న ఆమెతో మాట్లాడా.. ఓడినా చక్కగా ఆడావని చెప్పా.. ఈరోజు ఇంకా బాగా ఆడాలని చెప్పా.. నాకు గిఫ్ట్‌గా మెడల్ గెలవాలన్నాను. ఓటమి నుంచి కోలుకొని.. చక్కగా రాణించింది. కాంస్యం సాధించింది. ప్రధాని మోదీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. 'సింధు ఆప్ జావ్.. ఆనేకా బాద్ హమ్ ఐస్‌క్రీం ఖాయేంగే 'అంటూ ప్రోత్సహించారు. దేశానికి మరిన్ని పతకాలు తెచ్చేందుకు సింధు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.