రాష్ట్రంలో మరింత పకడ్బందీగా కరోనా పరీక్షలు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రోజుకు 7,500 వేలమందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటివరకు చనిపోయింది 10 వేలమంది మాత్రమేనన్నారు. ఆరోగ్య కార్యకర్తలు హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లి పరీక్షలు చేస్తారని వెల్లడించారు.
'రోజుకు 7,500 మందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యముంది'
రాష్ట్రంలో రోజుకు 7,500 వేలమందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆరోగ్య కార్యకర్తలు హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లి పరీక్షలు చేస్తారని వెల్లడించారు.
రోజుకు 7,500 మందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యముంది: ఈటల
ఖర్చు భరించగలిగే స్తోమత ఉన్నవాళ్లు ప్రైవేటుగా పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు. వారం పదిరోజుల్లో 50 వేల కరోనా పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు. అవసరం అనుకుంటే కరోనా పరీక్షల సంఖ్య పెంచుతామని వివరించారు.
ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల