కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయడం వల్ల పార్టీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహపడ్డాయని అన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఒక మంచి ఆలోచనతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని కొనియాడారు. ప్రియాంక గాంధీ సేవలను తగిన విధంగా వినియోగించుకోవాలని సూచించారు.
సోనియాగాంధీ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నాం : మర్రి - పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ తీసుకున్న పార్టీ ప్రక్షాళన తీర్మానాన్ని త్వరలో ఆచరణలో పెట్టాలని ఆయన కోరారు.
సోనియాగాంధీ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నాం : మర్రి శశిధర్