తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రం, ఐసీఎంఆర్ సూచనల ప్రకారమే పరీక్షలు: ఈటల - instructions of the Centre and ICMR

రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్రం, ఐసీఎంఆర్ సూచించిన నిబంధనల మేరకే కరోనా పరీక్షలను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

'కేంద్రం, ఐసీఎంఆర్ సూచనల ప్రకారమే పరీక్షలు చేస్తున్నాం'
'కేంద్రం, ఐసీఎంఆర్ సూచనల ప్రకారమే పరీక్షలు చేస్తున్నాం'

By

Published : May 8, 2020, 7:16 PM IST

Updated : May 9, 2020, 12:20 AM IST

రాష్ట్రంలో కొత్తగా 10 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మొత్తంగా కేసులు 1,132కి చేరుకున్నాయన్నారు. కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదని వెల్లడించారు. కేంద్రం నిబంధనల ప్రకారం మరో 14 జిల్లాల్లో కరోనా లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో అనేక జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వెళ్లాయని చెప్పారు. సూర్యాపేట, వరంగల్ అర్బన్‌, నిజామాబాద్‌ జిల్లాలు రెడ్‌ జోన్ నుంచి ఆరెంజ్‌ జోన్‌గా మారాయన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మాత్రమే రెడ్‌జోన్ జిల్లాలుగా ఉన్నాయని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ మే 17 వరకే అని కేంద్రం చెప్పినా.. సీఎం కేసీఆర్ 29 వరకు పొడిగించారని గుర్తు చేశారు.

'నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నాం'

పాజిటివ్ కేసులు వచ్చిన ఇళ్లలో కరోనా నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నామన్నారు. కరోనా పరీక్షలు చేయట్లేదనే ఆరోపణలు అబద్ధమని కేంద్రానికి నివేదించామన్నారు. 75 ఏళ్లు దాటిన వ్యక్తి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని అన్నారు. డయాలసిస్‌ రోగి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

కరోనా వచ్చినా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది...

కరోనా సోకిన గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని.. మన వైద్యులు గొప్పగా పనిచేస్తున్నారని చెప్పేందుకు ఇదే ఉదాహరణ అని ప్రశంసించారు. కంటైన్‌మెంట్ జోన్లలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. పాతబస్తీలో వస్తున్న కరోనా కేసులపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. కరోనా రాకుండా ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం గ్రీన్‌జోన్‌లో అనుమతించిన కార్యక్రమాలన్నీ కొనసాగుతాయని మంత్రి ఈటల పునర్ఘాటించారు. హైదరాబాద్‌లోని 30 సర్కిళ్లలో 22 సర్కిళ్లలో పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు.

'కేంద్రం, ఐసీఎంఆర్ సూచనల ప్రకారమే పరీక్షలు చేస్తున్నాం'

ఇవీ చూడండి : మందుబాబులను చితకబాదిన మహిళ

Last Updated : May 9, 2020, 12:20 AM IST

ABOUT THE AUTHOR

...view details