అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటి స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే వచ్చాయని, అంబానీ తీసుకొచ్చే సాంకేతికతను జాగ్రత్తగా గమనిస్తున్నామని టాలీవుడ్ నిర్మాత ప్రసాద్ వీ పొట్లూరి తెలిపారు. చలన చిత్ర పరిశ్రమ కొత్త పద్ధతులను అలవాటు చేసుకుంటూ, కార్పొరేట్ ప్రపంచంతో పోటీ పడటం సవాళ్లతో కూడుకున్న పని అని అన్నారు.
ఫస్ట్ డే ఫస్ట్ షోపై తీవ్రంగా చర్చిస్తున్నాం - First Day First Show
రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇంట్లో ఫస్ట్ డే ఫస్ట్ షో సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు జియో ప్రకటించింది. ఈ ప్రకటన చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై టాలీవుడ్ నిర్మాత ప్రసాద్ వీ పొట్లూరి స్పందించారు. అంబానీ తీసుకొచ్చే సాంకేతికతను జాగ్రత్తగా గమనిస్తున్నామన్నారు.
ప్రసాద్ వీ పొట్లూరి