జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ భోజనం నాణ్యతతో అందిస్తున్నారని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత అన్నారు. అన్నపూర్ణ భోజనంతో పేదవాడి ఆకలి తీరుస్తోందని ఆమె చెప్పారు. నాణ్యతతో కూడిన భోజనం అందించడంతోనే అన్ని వర్గాల ప్రజలు, రోడ్డు మీద వెళ్తున్న వారు అన్నపూర్ణ భోజనం కేంద్రానికి వెళ్లి ఆకలి తీర్చుకుంటున్నారని తెలిపారు. పేదవారు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతోనే జీహెచ్ఎంసీ లాక్ డౌన్ సమయంలో ఉచితంగా భోజనం అందిస్తున్నట్లు వెల్లడించారు.
పేదవాడి ఆకలి తీరుస్తున్నాం: డిప్యూటీ మేయర్ - కరోనా వార్తలు
హైదరాబాద్ నగరంలోని అన్నపూర్ణ భోజన కేంద్రాలను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తనిఖీ చేశారు. అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదవాడి ఆకలి తీరుస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
ghmc
నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించి డిప్యూటీ మేయర్ రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలోని అన్నపూర్ణ భోజనం కేంద్రాన్ని తనిఖీ చేశారు. సమయానికి భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. నిజాం కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బందితో కలిసి డిప్యూటీ మేయర్ అన్నపూర్ణ కేంద్రంలో భోజనం చేశారు.