సచివాలయం కూల్చివేత కవరేజీకి అనుమతివ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కూల్చివేతల వివరాలతో మీడియాకు బులెటిన్ ఇవ్వడానికి సిద్ధమని ప్రభుత్వం తెలిపింది. బులెటిన్‌లో వివరాలు సమగ్రంగా ఉండవని మీడియాను అనుమతించాలని పిటిషనర్ కోరారు.
'సచివాలయం కూల్చివేతలపై మీడియా బులెటిన్ ఇవ్వడానికి సిద్ధం' - సచివాలయం కూల్చివేత కేసు
సచివాలయం కూల్చివేతల వివరాలతో మీడియాకు బులెటిన్ ఇవ్వడానికి సిద్ధమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సచివాలయం కూల్చివేత కవరేజీకి అనుమతివ్వాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. టూర్ ఏర్పాటు చేసి మీడియాను తీసుకెళ్లగలరా అని హైకోర్టు అడిగింది. ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతామని ఏజీ తెలిపారు. విచారణను మధ్యాహ్నం 2.30కు హైకోర్టు వాయిదా వేసింది.
telangana secretariat
కూల్చివేతల వద్దకు ఎవరినీ వెళ్లనీయవద్దని నిబంధనలు చెబుతున్నాయని ఏజీ ప్రసాద్ పేర్కొన్నారు. టూర్ ఏర్పాటు చేసి మీడియాను తీసుకెళ్లగలరా అని హైకోర్టు అడిగింది. ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతామని ఏజీ తెలిపారు. విచారణను మధ్యాహ్నం 2.30కు హైకోర్టు వాయిదా వేసింది.